ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ విషయం హాట్ టాపిక్ గా మారింది. అతని అరెస్టును కొంతమంది ఖండిస్తున్నారు, మరి కొంతమంది ఇది లీగల్ గా కరెక్టే అని అంటున్నారు. నిజానికి బన్నీ సినిమా చూడ్డానికి వెళ్ళినప్పుడు ఓపెన్ రూఫ్ ఆఫ్ కారులో నుంచి బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ఆ సమయంలో అతన్ని చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా థియేటర్లలోకి పోటెత్తారు. ఈ క్రమంలో కింద పడటం, ఒకరినొకరు తోసుకోవడం జరిగింది. అలా జరిగిన తోపులాటలో రేవతి మరణించింది. ఆమె మరణంలో అల్లు అర్జున్ బాధ్యత కచ్చితంగా ఉంటుంది. అందుకే ఈ కేసులో అతన్ని చేర్చడంలో లీగల్ గా కరెక్ట్ అని చాలామంది వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే మరొక చర్చ ఆసక్తికరంగా మారింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ లో తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. 'తెలంగాణ సీఎం ఎవరు? పేరు మర్చిపోయాను' అంటూ ఆయన మైక్ లో మాట్లాడిన విషయాలు కూడా స్పష్టంగా వినిపించాయి. తర్వాత గొంతులో తడి ఆరిపోయింది అందుకే స్పీచ్ ఆపు చేశాను అంటూ కవరింగ్ ఇచ్చారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఇది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వెళ్లినట్లు చాలామంది ప్రచారం చేశారు. అది విని రేవంత్ రెడ్డి బాగా ఫీల్ అయిపోయినట్లు సమాచారం.

"ఈరోజుల్లో ఏ చిన్న పిల్లోడిని అడిగినా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తారు కానీ బన్నీ ఎందుకు చెప్పలేదు. అతను కావాలనే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్లు మాట్లాడాడు. తనని చులకనగా తీసేశాడు" అనే కోణంలో రేవంత్ రెడ్డి ఫీల్ అయిపోయినట్లు కొందరు కొత్త లాజిక్కు తెరపైకి తెచ్చారు. వారి లాజిక్ ప్రకారం బన్నీ తన పేరు మర్చిపోవడం వల్ల హర్ట్ అయిపోయిన రేవంత్ రెడ్డి అతనిపై పగబెట్టారు అతని ఎలాగైనా జైల్లో కొన్ని రోజులు ఉంచి, తన కోపం తీర్చుకోవాలనే అరెస్ట్ చేయించారని కొందరు కొత్త విశ్లేషణ వినిపిస్తున్నారు. బన్నీ యాక్షన్ రేవంత్ రెడ్డి రియాక్షన్ పేరిట చాలా వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు అంటే బన్నీ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాను అంటూ యాక్షన్ చేయడం, దానికి రియాక్షన్ గా రేవంత్ రెడ్డి అతని అరెస్టు చేసి జైల్లోకి తోయడం జరిగిందని అంటున్నారు. కానీ ఇలా ఆలోచించడం, అలానే ఇలా అరెస్టులు చేయించడం తప్పు.

మరింత సమాచారం తెలుసుకోండి: