అల్లు అర్జున్ అరెస్ట్ ఒక సంచలనంగా మారింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లడంతో పాటుగా కోర్టులో క్యాష్ పిటిషన్ విచారణ కూడా జరిగింది. ఈ లోపుగా పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు బడా పొలిటికల్ లీడర్స్ కూడా అల్లు అర్జున్ కు సపోర్ట్ చేయడం జరిగింది. మరి కొంతమంది నిర్మాతలు ఏకంగా చిక్కడపల్లి స్టేషన్ వద్దకు వెళ్లారు.. అయితే వీరంతా కూడా బన్నీకి మద్దతుగానో , సింపతిగానో వెళ్లడం జరిగింది. అయితే చిరంజీవి వస్తారనే వార్త వినిపించిన పోలీసులు రావద్దు అని చెప్పడంతో ఆగిపోయినట్టు సమాచారం.


అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే సినిమా ప్రీమియర్ షో చూడడానికి వచ్చిన హీరో ఆ కారణంగా జరిగిన తొక్కిసలాటలో ఒక సాధారణ మహిళ మరణిస్తే ఒక్కరంటే ఒకరు కూడా సినిమా వాళ్లు వెళ్లి కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదట. మద్దతుగా కూడా నిలచలేదని.. ఎందుకంటే ఆమె ఒక సాధారణ మహిళ కాబట్టి బన్నీ సెలబ్రిటీ కాబట్టి అంతేకాకుండా ఆ మహిళ ఇండస్ట్రీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి ఆమెను పట్టించుకోలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఒక్కొక్కరు వందల కొద్ది పారితోషకం తీసుకుంటున్నప్పటికీ కేవలం పాతిక లక్షలు ఇస్తే సరిపోతుందా? ఒక సాధారణ మహిళ ప్రాణం విలువ అంతేనా అంటూ మరికొంతమంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. కానీ ఒక స్టార్ హీరో ఆ బాధితురాలి కుటుంబ ఇంటికి వెళ్లి కనీసం ఒక కోటి రూపాయలైనా ఇచ్చి ఉంటే ఈరోజు అల్లు అర్జున్ మీద ఇంత నెగెటివిటీ వచ్చేది కాదనే విధంగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు.. అంతేకాకుండా లాయర్లకు, కోర్టులకు లక్షల లక్షల ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదని.. ఒక కామన్ మ్యాన్ ప్రాణం విలువ ఇంత తక్కువ సింపతి కూడా ఉండదా పరామర్శ కూడా ఉండదా అన్నది ఇప్పుడు ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: