సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వచ్చిన సమయంలో తమ గురించి తప్ప అభిమానుల గురించి, వాళ్ల భద్రత గురించి అస్సలు ఆలోచించరు. అయితే బన్నీ అరెస్ట్ టాలీవుడ్ సెలబ్రిటీలకు వార్నింగ్ బెల్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇకపై అభిమానులకు ఏం జరిగినా సెలబ్రిటీలు సైతం బాధ్యత వహించాల్సి ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
అల్లు అర్జున్ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. 20 ఏళ్ల సినీ కెరీర్ లో బన్నీపై ఎలాంటి మచ్చ లేదు. బన్నీ మాత్రం ఓవర్ నైట్ లో అరెస్ట్ కావడం వల్ల వార్తల్లో నిలిచారు. ఇకపై అభిమానులు ఎలాంటి ఘటనలలో మృతి చెందినా సెలబ్రిటీలు బాధ్యత వహించాల్సి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ మాత్రం ప్రేక్షకుల్లో మామూలుగా అయితే లేదని చెప్పవచ్చు.
 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. అరెస్ట్ కావడం వల్ల బన్నీ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. బన్నీ జైలులో సాధారణ ఖైదీలాగే ఉన్నారని సమాచారం అందుతోంది. బన్నీకి కష్టం వస్తే కుటుంబ సభ్యులే అండగా నిలుస్తారు తప్ప ఇతరులు కాదు. బన్నీ సైతం ఈ విషయాలను గుర్తు పెట్టుకుంటే మంచిదని చెప్పవచ్చు.
 
జైలు జీవితాన్ని బన్నీ ఏ విధంగా మలచుకుంటారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. బన్నీ ఇకపై కెరీర్ పరంగా మరింత ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. బన్నీ విషయంలో సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. అల్లు అర్జున్ కు 2024 బ్యాడ్ ఇయర్ అని ఈ హీరోకు 2025 సంవత్సరం కలిసిరావాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. బన్నీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు.




 


మరింత సమాచారం తెలుసుకోండి: