ఏంటి నాగచైతన్య సమంతకు 200 కోట్లు ఇచ్చారా..విడాకుల తర్వాత ఈ 200 కోట్ల మేటర్ ఎందుకు బయటకు వచ్చింది.అసలు వెలుగులోకి వచ్చిన ఈ 200 కోట్ల ముచ్చట ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. నాగచైతన్య రీసెంట్ గానే శోభిత ధూళిపాళ్లని రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు. అయితే వీళ్ళిద్దరి రెండో పెళ్లి వేళ శోభిత దూళిపాళ్లకు అంతకు ముందు ఉన్న అఫైర్స్, నాగచైతన్యకు అంతకుముందు పెళ్లి జరిగిన ముచ్చట్లు ఇలా ఎన్నో మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక పెళ్లయ్యాక శోభిత పెళ్లి చీర, నగలు, పెళ్లి చేసుకున్న తీరు ఇలా ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే పెళ్లయిన వారం రోజులకే నాగచైతన్య సమంతకి సంబంధించిన 200 కోట్ల మ్యాటర్ వెలుగులోకి వచ్చింది.

మరి ఇంతకీ ఆ 200 కోట్లు ఏంటి.. నాగచైతన్య సమంతకి 200 కోట్లు ఇవ్వడం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ఇక 200 కోట్లు ముచ్చట ఏంటంటే.. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన సమయంలో సమంతకి భరణం కింద ₹200 కోట్ల డబ్బుని ఇచ్చారట. అయితే భార్యాభర్తలు విడిపోతే భార్యకి భరణం కింద కోర్టు ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పమని చెబుతుంది.అలా నాగచైతన్య సమంత విడాకుల సమయంలో కూడా సమంతకి రెండు వందల కోట్ల భరణం ఇవ్వాలి అని నాగచైతన్యకి కోర్టు చెప్పిందట.

అయితే 200కోట్ల డబ్బు తనకు భరణం కింద వద్దని,ఇద్దరం ఇష్టప్రకారమే విడాకులు తీసుకున్నామని,ఆయన డబ్బు కోసం ఆశపడ నేను లేను అని సమంత నిర్మోహమాటంగా చెప్పేసిందట. అయితే ఇప్పటివరకు సమంత భరణం తీసుకున్న విషయం మీడియాలో వైరల్ అవ్వలేదు.కానీ తాజాగా ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడంతో సమంత 200 కోట్లు భరణం తీసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: