ఐకన్ స్టార్ అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. తాను విడుదల సందర్బంగా అభిమానులు సినీ ప్రముఖులు ముందుగానే వచ్చి జైలు ముందు వేచి ఉన్నారు. దీంతో సెక్యూరిటీ కారణాల వల్ల పోలీసులు, అల్లు అర్జున్‌ ని జైలు వెనుక ఉన్న గేటు నుంచి ఇంటికి పంపించారు. జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్‌ నేరుగా గీతా ఆర్ట్స్‌ ఆఫీసుకు వెళ్లారు. ఆ తర్వాత ఆయన ఇంటికి చేరుకున్నారు. జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యాలు చేశారు.
తాను చట్టాన్ని గౌరవిస్తానని.. విచారణకు సహకరిస్తానని అన్నారు. తనకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. కేసు గురించి ఏమి మాట్లాడలేనని బాధపడ్డారు. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి సానుభూతి తెలిజేస్తున్నాను అని అల్లు అర్జున్ అన్నారు. జరిగిన ఘటన దురదృష్టకరమని.. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని తెలిపారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదని వ్యాక్యానించారు. ఏదేమైనా ఆ ఫ్యామిలీకి అన్నివిధాలా అండగా ఉంటా భరోసానిచ్చారు. తాను బాగానే ఉన్నానని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉందని తెలిపారు.
ఇక అల్లు అర్జున్ విడుదలతో పాటు సంధ్యా థియేటర్‌ యాజమాన్యం సభ్యులు కూడా బెయిల్ పై విడుదలయ్యారు. విడుదల సమయంలో లాయర్లతో పాటుగా అల్లు అరవింద్‌ కూడా జైలుకు వెళ్లారు. దగ్గరుండి అల్లు అర్జున్‌ను తన వెంట తీసుకొచ్చారు. ఇక పుష్ప–2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి, తర్వాత ఆయనకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్‌ విధింపుల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: