ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ..... ఆ రోజు థియేటర్ వద్ద ప్రమాదవశాత్తు ఘటన జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. అది యాక్సిడెంటల్‌గా జరిగిన ఘటనే.. దాంతో నాకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ కుటుంబానికి ఎలాంటి సహాయమైనా సరే.. నేను అండగా ఉంటాను, ఆదుకుంటానని ప్రకటించారు. ఆ థియేటర్‌కి 20 ఏళ్లలో 30 సార్లకు పైగా వెళ్లాను.. కానీ ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు అల్లు అర్జున్.
ఇక ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ను కలిసేందుకు సెలబ్రీటీలు వస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటికి పోటెత్తుతున్నారు సినీ ప్రముఖులు. బన్నీని ఇప్పటికే దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు, నటుడు శ్రీకాంత్, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, రానా లాంటి వారు కలిసారు. ఇక అటు కొంత మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు.
తాజాగా బన్నీ విషయంలో తమ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసహనం చేయడం జరిగింది. బన్నీ అరెస్ట్ అవ్వడం బాధాకరం.. హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడం సంతోషంగా ఉందంటూ వ్యాక్యానించారు. ఇదొక దురదృష్టకరమైన ఘటన.. దీని పట్ల చింతిస్తున్నానంటూ ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.