మొన్నటి వరకు టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ వివాదం ఎంతో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే .. అయితే ఈ వివాదాన్ని కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మోహన్‌ బాబు దాడి చేశారు .. టీవీ9 మీడియా రిపోర్టర్ రంజిత్ పై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు .. ఇక దాంతో మోహన్ బాబు పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు .. దాడి తర్వాత రెండు రోజులు ఆస్పత్రుల్లో ఉన్న మోహ‌న్‌ బాబు ఆ తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు .. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఈ సీనియర్ నటుడు .. మీడియాపై దాడి కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టి వేసింది .. ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు వాంగ్మూలం రికార్డ్ చేయడానికి వెళ్ళిన పోలీసులకు ఆయన ఎక్కడా కనిపించలేదు ...
 

ఇక దాంతో మోహన్ బాబు కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారంటూ  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది .. ఇక తాజాగా దాని గురించి వస్తున్న వార్తలు పై మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశాడు. ఇక సోషల్ మీడియాలో మోహన్ బాబు మిస్సింగ్ అంటూ నానా రచ్చ నడుస్తున్న సమయంలో ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టాడు .. “నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంది. ముందస్తు బెయిల్ తిరస్కరించలేదు. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. నా గురించి అసత్యపు వార్తలు రాయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.



అయితే ఇప్పుడు మోహన్ బాబు తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు నెటిజెన్లు , ప్రజాప్రతినిధులు .. సహనం కోల్పోయి మీడియా పై దాడి చేయడం సరికాదని అంటున్నారు .. మోహ‌న్ బాబు సంయమనం కోల్పోయి ప్రవర్తించడం సరికాదని అంటున్నారు .. మీడియా రిపోర్టర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు . మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు తీరుపై నిరసనలకు కూడా జర్నలిస్ట్ సంఘాలు పిలుపునిచ్చారు .. తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా ధర్నాలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు ..



మరింత సమాచారం తెలుసుకోండి: