తెలుగు సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలలో నటించి తన అంద చందలతో కుర్రకారులను మాయ చేసిన హీరోయిన్ రాధిక ఆప్టే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే వివాహమై 12 ఏళ్ల తర్వాత తాజాగా తాను ఆడబిడ్డకు జన్మనిచ్చాననే విషయాన్ని బయట పెట్టింది రాధిక ఆప్టే.. ఈ విషయం తెలిసిన అభిమానుల సరిత సంతోషంతో రాధిక ఆప్టే జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే అందుకు సంబంధించిన ఫోటోలను రాధిక ఆప్టే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డెలివరీ తర్వాత వర్క్ మీటింగ్ అని ఒక ఫోటోని ఇన్స్టాలో పోస్ట్ షేర్ చేయడం జరిగింది.


గడిచిన వారం క్రిందట డెలివరీ అయ్యిందట రాధిక ఆప్టే..అయితే పాపకి పాలు తాగుతున్న ఫోటోని సైతం ఇప్పుడు  షేర్ చేస్తే తెలిపింది. రాధిక ఆప్టే తెలుగు తమిళ్, మలయాళం, హిందీ, బెంగాలీ ,ఇంగ్లీష్ వంటి భాషలలో కూడా నటించింది. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో బ్రిటిష్ వయోలినిస్ట్ టేలర్ ను ప్రేమించి వివాహం చేసుకున్నది.. 2012లో వీరు వివాహం జరగగా దాదాపుగా 12 ఏళ్ల తర్వాత వీరు తల్లిదండ్రులయ్యారు.


రాధిక ఆప్టే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా సుమారుగా తొమ్మిది నెలలపాటు ఎవరికి చెప్పలేదు ఒక ఈవెంట్లో ఆమె బేబీ బంప్ ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మొదట థియేటర్ ఆర్టిస్టుగా తన కెరీయర్ని మొదలుపెట్టిన రాధిక తెలుగులో లెజెండ్ రక్త చరిత్ర లయన్ తదితర చిత్రాలలో నటించింది. న్యూడ్ సేమ్యా న్యూడ్ చిత్రాలలో నటిస్తూ భారీ క్రేజ్ అందుకుంది రాధిక ఆప్టే ఈమె నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నది. మొత్తానికి రాధిక ఆప్టే తల్లినయ్యా అనే విషయాన్ని బయట పెట్టడంతో పలువురి సెలబ్రిటీలు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. అభిమానులు తెలుగు లో ఏదైనా సినిమాలు నటించమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: