తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటిగా గుర్తింపు తెచ్చుకున్న కోవై సరళ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. బ్రహ్మానందం , కోవైసర‌ళ‌ కామెడీ అంటే ఒకప్పుడు బ్రాండ్ అనే చెప్పవచ్చు .. అలాగే వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో భార్యాభర్తలుగా నటించి కామెడీ పండించారు .. అలాంటి కోవై స‌ర‌ళ‌ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా కానీ నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడి పెళ్లి కూడా చేసుకోలేదు .. దానికి కారణాలు ఏంటి అనేది ఇక్కడ చూద్దాం.
 

1979 లో ఆర్ కృష్ణ   దర్శకత్వంలో రత్నం అనే సినిమాతో కోవై సరళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది .. ఆ మూవీలో ఎంతో చిన్న పాత్ర చేసిన మంచి గుర్తింపు తెచ్చుకుంది.   ఆ తర్వాత ముందని ముగించు అనే కోలీవుడ్ సినిమాలో గర్భవతిగా నటించింది .. ఆ సినిమా దగ్గరనుంచి ఆమెకు వరుస‌ అవకాశాలు వచ్చాయి .. ఇక 1987లో మోహన్ బాబు హీరోగా వచ్చిన వీర ప్రతాపం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది .. తన మొదటి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోవై సరళ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్టార్డం ను తెలుగు , తమిళ ఇండస్ట్రీలో తెచ్చుకుంది .. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో కోవై సరళ , బ్రహ్మానందం కామెడీ గురించి మాటల్లో చెప్పలేము అలాంటి కోవై సరళ ఈ మధ్యకాలంలో సినిమాల్లో చాలా తక్కువగా నటిస్తుంది.

 

అయితే ఇదే విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమెను అడగగా .. ఇండస్ట్రీలో కమెడియన్స్ ఎక్కువ అయిపోయారు మాలాంటి వాళ్లకు ఆఫర్లు తగ్గాయని ఆమె చెప్పకు వచ్చింది .. ఇంతవరకు పెళ్లెందుకు చేసుకోలేదు అనే ప్రశ్నకు కూడా కోవై సరళ సమాధానమిచ్చింది .. తన ఫ్యామిలీలో అక్కాచెల్లెల కోసం తాను పెళ్లి చేసుకోలేదని అక్క చెల్లెలు అందరినీ విదేశాల్లో సెటిల్ చేశానాని ఆమె చెప్పుకొచ్చింది .. తను సంపాదించిన డబ్బు మొత్తం కుటుంబానికి ఖర్చు చేశానని .. మా చెల్లెలు, అక్కల పిల్లల కోసమే డబ్బంతా కొచ్చిపోయిందని ప్రస్తుతం నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని ఆమె చెప్పుకొచ్చింది .. ఉన్న కొంత ఆస్తి కోసం కుటుంబ సభ్యులు నాపై కోర్టులో కేసు వేశారని జీవితంలో జరిగిన దారుణాలను ఆమె గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: