దిష్టి పోయింది బాబాయ్ అంటూ అల్లు అర్జున్ అరెస్టు పైన... తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు మంచు మనోజ్.ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు మంచు మనోజ్ కుమార్. ఇలాంటి కష్టకాలంలో కూడా ప్రశాంతంగా ఉండడం నీ బాధ్యత అల్లు అర్జున్ అంటూ ట్వీట్ చేశాడు. బాధిత కుటుంబానికి అండగా నిలవడం నీ క్యారెక్టర్ కు నిదర్శనమని కొనియాడారు.
ఓవరాల్గా దిష్టి మొత్తం పోయింది.... వెల్కమ్ బ్యాక్ అంటూ మనోజ్ పోస్ట్ పెట్టారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన... అందరినీ కలిచి వేసింది. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. కానీ జరిగిన విషయం తర్వాత... అల్లు అర్జున్ వెంటనే రియాక్ట్ అయి వాళ్లకు తగిన సహాయం కూడా చేశాడు. ఆ విషయంలో అల్లు అర్జున్ ను మెచ్చుకోవచ్చు అని కొనియాడారు మంచు మనోజ్.
కానీ ఇప్పుడు అనవసరంగా అల్లు అర్జున్ అరెస్టు చేసి తప్పు చేశారని... ఫైర్ అయ్యారు మంచు మనోజ్. ఇది ఇలా ఉండగా ఇవాళ ఉదయం అల్లు అర్జున్.... జైలు నుంచి రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.వాస్తవానికి నిన్న రాత్రి అల్లుఅర్జున్ రిలీజ్ కావలసి ఉండేది. కానీ బెయిల్ ఆన్లైన్లో రావడం... కాస్త ఆలస్యమైందని... అందుకే రిలీజ్ ఇవాల్టికి వాయిదా పడింది. దీనిపై కూడా బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.