తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటి మణులతో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన అందాలతో , డ్యాన్స్ తో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో వరుస పెట్టి ఈ బ్యూటీ కి తెలుగు లో అవకాశాలు వచ్చాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ ముద్దు గుమ్మ నటించిన గుంటూరు కారం సినిమా విడుదల అయింది.

మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ కి కూడా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇద్దరు క్రేజీ హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వారెవరో కాదు అక్కినేని హీరోలు అయినటువంటి నాగ చైతన్య , అఖిల్ అని తెలుస్తోంది.

నాగ చైతన్య తదుపరి మూవీ లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అలాగే అఖిల్ నటించబోయే తదుపరి మూవీ లో కూడా ఈ ముద్దు గుమ్మ హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలా ఒకే సారి ఈ ఇద్దరు క్రేజీ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో ఈ బ్యూటీ జాక్పాట్ కొట్టేసింది అని శ్రీ లీలా ఫాన్స్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: