తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వివాదాలు ఎక్కువ అవుతున్నాయి.  అసలు ఎలాంటి వివాదాలు లేక ముందే మీడియా ఏదో ఒక వివాదం సృష్టించి ట్రోల్ చేసే ఈ తరుణంలో, ఇక వివాదాలు వస్తే ఇంకెంత ట్రోలింగ్ చేస్తుందో  మనందరికీ తెలుసు. అలా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నుంచి మొదలు పుష్ప హీరో అల్లు అర్జున్ వరకు  ఎన్నో వివాదాలు వచ్చాయి. వీరంతా సెలబ్రిటీలు కావడంతో సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి. అయితే జానీ మాస్టర్ ఒక లేడీ కొరియోగ్రాఫర్ పై అఘాయిత్యం చేశారని కేసు నమోదు అవ్వడంతో అది కాస్త వైరల్ గా మారింది. అది మరువక ముందే మోహన్ బాబు కుటుంబ వ్యవహారం మొత్తం రోడ్డున పడింది.  ఆస్తుల విషయంలో తన ఫ్యామిలీతో మోహన్ బాబుకు గొడవ రావడంతో అది కాస్త  మీడియాలో కోడై కూసింది. దీంతో  మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేయడం చివరికి స్వారీ చెప్పడం అవన్నీ జరిగిపోయాయి.  

ఈ విషయం నడుస్తున్న తరుణంలోనే పుష్ప హీరో అల్లుఅర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి సంధ్య థియేటర్ కి సినిమా చూడటానికి వెళ్లారు. దీంతో అక్కడికి వచ్చిన జనాల తాకిడికి రేవతి అనే  మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో శుక్రవారం నుంచి మొదలు ఇప్పటివరకు మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తున్నాయి.  బన్నీ అరెస్టుపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఇదే తరుణంలో నాని కూడా బన్నీ అరెస్టుపై చాలా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా బచ్చలమల్లి సినిమా ఈవెంట్ ఒకటి జరిగింది.ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.. మీడియాని ఉద్దేశిస్తూ నిన్నటి నుంచి బాగా బిజీగా ఉన్నట్టున్నారు అంటూ చెప్పుకొచ్చారు.. నిన్నటి నుంచి అంటే పూర్తిగా అల్లు అర్జున్ వార్తలు వచ్చాయి కాబట్టి  ఆయననే  ఉద్దేశించే నాని మాట్లాడాలని కొంతమంది అంటున్నారు.. అంతేకాదు నాని తన సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: