ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అయింది. అల్లు అర్జున్ తప్పు లేకపోయినా అరెస్ట్ చేశారని కొంతమంది కామెంట్లు చేయగా బన్నీని అరెస్ట్ చేయడం రైటేనని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే అరెస్ట్ వల్ల బన్నీకి మేలే జరిగిందనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. బన్నీ ఎవరి బుద్ధి ఏంటో క్లియర్ గా అర్థమైందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
 
ఇకపై బన్నీ ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వనున్నారని తనను మోసం చేసిన వాళ్లను ఆయన అస్సలు క్షమించరని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ క్రేజ్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ ఉన్న నేపథ్యంలో ఆయనపై కావాలని కుట్రలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ రేంజ్ సైతం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
 
అల్లు అర్జున్ ఇకపై ఔట్ డోర్ ఈవెంట్లకు హాజరయ్యే సమయంలో, థియేటర్లలో సినిమా చూడటానికి వెళ్లే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బన్నీ కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
 
అల్లు అర్జున్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను సైతం అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అల్లు అర్జున్ టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో నటించాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథల ఎంపిక మాత్రం అద్భుతంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: