అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ కొంత కాలం క్రితం కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. అలాగే హను రాగవపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఇకపోతే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీ చేయడానికి ప్రభాస్ చాలా రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇంత వరకు తన కెరియర్లో ఎప్పుడు ఏ సినిమాలో పోలీస్ పాత్ర చేయలేదు. దానితో ఈ మూవీ లో పోలీస్ పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు అనే వార్త బయటికి రావడం తోనే ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో తారా స్థాయికి చేరిపోయాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అలాగే ఈ సినిమాలో కరీనా కపూర్ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొంత కాలం క్రితం ప్రభాస్ "ఆది పురుష్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక మరో సారి ప్రభాస్ హీరోగా రూపొందుబోయే సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: