హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసింది. రేవతి కుమారుడు సైతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడం ... ఆ రాత్రంతా జైలులో ఉండి మరుసటి రోజు ఉదయం బెయిలు పై రిలీజ్ అవ్వటం తెలిసిందే. అయితే తొక్కిసలాట ఘటన పై జైలు పై బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడిన మాటల్లో కాస్త వ్యత్యాసం కనిపిస్తుందన్న చర్చలు వినిపిస్తున్నాయి. అటు బాధితుడు చెబుతున్న వెర్షన్ కు ఇటు అల్లు అర్జున్ చెబుతున్న స్టేట్మెంట్ కు పొంతన కుదరటం లేదు.
ఈ రోజు ఉదయం నుంచి అల్లు అర్జున్ వరుసగా మూడుసార్లు ప్రెస్ మీట్లు పెట్టారు. జాతీయ మీడియాను సైతం ఆహ్వానించారు. ఆ ఘనట జరిగినప్పుడు తాను లోపల ఉన్నట్టు అర్తం వచ్చేలా మాట్లాడారు. బాధితురాలి భర్త భాస్కర్ వెర్షన్ మరోలా ఉంది. బన్నీ రావడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని... థియేటర్ లోపలకు వెళదాం అనుకుంటోన్న టైంలో బన్నీ రావడంతో నా భార్య, కుమారుడు కాస్త ముందుకు వెళ్లారని.. తర్వాత ఫోన్ చేస్తే అక్కడే ఉన్నాం అని చెప్పారని.. ఆ తర్వాత స్విచ్ఛాఫ్ వచ్చిందని.. ఆ తర్వాత పోలీసులు నా భార్య చనిపోయిందని చెప్పారని భాస్కర్ తెలిపాడు. అయితే థియేటర్ కు వెళ్లినప్పుడు ప్రొసీజర్ ఫాలో అయ్యారా ? పోలీసులకు సమాచారం ఇచ్చారా ? అన్న ప్రశ్నలకు మాత్రం అల్లు అర్జున్ సమాధానం దాట వేశాడు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఇంతకు మించి మాట్లాడలేనని.. త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు.