అయితే అల్లు అర్జున్ అరెస్టు అవుతాడు అని ఇప్పుడు కాదు దాదాపు మూడేళ్ల ముందే అల్లు ఫ్యామిలీకి ఓ పూజారి హెచ్చరించాడు అనే వార్త బయటకు వచ్చింది . అల్లు అర్జున్ జాతకం చూసిన ఓ పూజారి అల్లు అర్జున్ జాతకం అస్సలు బాగోలేదు అని .. ఆ కారణంగా అల్లు అర్జున్ చాలా చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. అల్లు అర్జున్ తన లైఫ్ లో పడలేని దెబ్బలు కూడా ఒక సర్టెన్ స్టేజీలో పడతాడు అని ..జైలుకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది అంటూ ఆ పూజారి ఎప్పుడు హెచ్చరించారట . కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం ఆ విషయాన్ని అస్సలు కేర్ చేయలేదు ..పట్టించుకోలేదు .
అయితే అనుకున్న విధంగానే అయింది . అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. ఒక పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ తన లైఫ్ లో ఎప్పుడూ చూడలేని కష్టమైనా పరిస్థితులు కూడా చూశాడు . జైల్లో ఉన్నాడు. అది కూడా ఆయన తప్పు లేకుండానే. జైల్లో బన్నీ గడిపిన రోజు ఎప్పటికి మర్చిపోలేనిది. దీంతో ఇప్పుడు అందరూ కూడా ఆ పూజారి చెప్పిందే నిజమైంది అంటూ భావిస్తున్నారు . అంతేకాదు అల్లు అర్జున్ కి దిష్టి తగిలింది అంటూ శాంతి పూజలు కూడా చేయిస్తున్నారట అల్లు ఫ్యామిలీ. సోషల్ మీడియాలో ప్రజెంట్ వార్త వైరల్ గా మారింది..!