అల్లు అర్జున్ కు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతూ వస్తున్నాయి . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ ..సంధ్య థియేటర్ తొక్కిసట ఘటన లో అరెస్టు అయిన కారణంగా సోషల్ మీడియాలో ఆయన పేరు ఓ రేంజ్ ట్రోలింగ్ కి గురైంది . కాగా ఆయన రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చేసాడు . కానీ ఇప్పటికి ఆయనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా ద్వారా వినిపిస్తూనే వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. 


అల్లు అర్జున్ ని చంచల్ గూడా జైల్లో 13 గంటల పాటు ఉంచిన విషయం అందరికీ తెలిసిందే . ఆఫ్ కోర్స్ ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చిన సరే కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ అందని కారణంగా గవర్నమెంట్ రూల్స్ కారణంగా ఆయనను జైల్లో పెట్టారు . మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ జైల్లోకి వెళ్తున్న మూమెంట్లో అక్కడున్న ఖైదీలు మొత్తం కూడా పుష్పరాజ్ పుష్పరాజ్ అంటూ అరుపులతో కేకలతో హొరెత్తించేసారట. నిజంగా అది అల్లు అర్జున్ కి ఒక గ్రేట్ అచీవ్మెంట్ నే చెప్పాలి .



సాధారణంగా అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ మంది హీరోలు అందుకుంటూ ఉంటారు . అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నాడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ తన కెరీర్ లో ఆ సీన్ మాత్రం ఎప్పటికి మర్చిపోలేడు. అఫ్ కోర్స్ ఎప్పటికీ అవమానాన్ని కూడా మర్చిపోలేరు అంటూ కూడా అభిమానులు చెప్పుకొస్తున్నారు . ఒక పెద్ద బడా పాన్ ఇండియా స్టార్ ని.. అది కూడా నేషనల్ అవార్డు అందుకున్న విన్నర్ ఇలా జైలుకు పంపడం చాలా చాలా దారుణం అంటున్నారు అభిమానులు . అయితే అల్లు అర్జున్ మాత్రం నేను చట్టాన్ని గౌరవిస్తాను అని మీడియా తో చెప్పడం హైలెట్గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: