- ( హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ ) . .


టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఒకప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ... విలన్ గా టాలెంట్ తో అలరిస్తున్నాడు. వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. బడా హీరోల సినిమాలుకు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మరి చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ కుమారుడు ఇప్పటికే టాలీవుడ్లో హీరోగా అడుగుపెట్టాడు. నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా మారి రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇది ఇలా ఉంటే రోషన్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు.


సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమా వృషభలో కూడా రోషన్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 2024లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పినా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఈ సినిమా ఆగిపోయిందని శ్రీకాంత్ స్వయంగా చెప్పారు. గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్లలో శ్రీకాంత్ ఈ విషయాన్ని చెప్పారు. వృషభ తొలి షెడ్యూల్ తోనే షూటింగ్ నిలిచిపోయిందని ఈ సినిమా తండ్రీ కొడుకుల మధ్య సాగే ఇంట్రన్స్ డ్రామాగా తెరకెక్క నున్న‌ట్టు తెలిపారు. మోహన్లాల్ రోషన్ తండ్రి కొడుకులు గా కనిపించినున్న‌ట్టు చెప్పారు. వృష‌భ‌ ఓ మంచి విజువల్ వండర్ అవుతుందని అంచనాల క్రియేట్ చేశారు. పాన్ ఇండియా సినిమా అవుతుందని అందరూ అనుకున్నారు .. కానీ ఇప్పుడు ఈ సినిమా నిలిచిపోయిందని శ్రీకాంత్ చెప్పడంతో అందరూ షాక్ అవుతుండ‌డంతో పాటు ఏదో జ‌రిగింద‌న్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: