- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


టాలీవుడ్ టాప్ హీరో నాగచైతన్య .. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల‌ పెళ్లి వేడుక ఈ నెల నాలుగో తేదీన అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహ వేడుకలు మెగాస్టార్ చిరంజీవి సైతం పాల్గొని .. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితోపాటు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా చైతు - శోభిత పెళ్లికి హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి వేడుకలో సమంత కూడా సందడి చేశారు. అదేంటి చైతు - శోభిత‌ పెళ్లి వేడుకలో సమంత సందడి చేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా సమంత అంటే చైతు మొదటి భార్య స్టార్ హీరోయిన్ సమంత కాదు .. సమంత - చైతు ప్రేమ వివాహం చేసుకొని నాలుగేళ్లు కూడా కలిసి కాపురం చేయకుండా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.



సమంత అంటే డాక్టర్ సమంతా .. ఆమె చైతు రెండో భార్య శోభితకు సిస్టర్ కావడం విశేషం. అక్క పెళ్లిలో దిగిన ఫోటోలను తాజాగా సమంత సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇది నా జీవితంలో చాలా ఎమోషనల్ సంఘటన .. అక్క నిన్ను నేను చాలా ప్రేమిస్తున్న ... మమ్మల్ని నువ్వు ఎంతగా ఇష్టపడతావో అలాగే నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తావో నాకు మాత్రమే తెలుసు .. మీ ఇద్దరు చాలా గౌరవప్రదమైన జంట అని నాకు తెలుసు అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది డాక్టర్ సమంత. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక శోభిత సిస్టర్ అయిన డాక్టర్ సమంత వృత్తిరీత్యా వైద్యు రాలు .. ఆమె 2022 లోనే పెళ్లి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: