అసలు ఇలాంటివి నమ్మని అల్లు ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ విషయంలో నమ్ముతూ ఉండటం ఫాన్స్ కి సైతం షాకింగ్ గా ఉంది . అల్లు అర్జున్ కి బాగా దిష్టి తగిలింది అని.. పుష్ప 2 సినిమా వెయ్యికోట్లు క్రాస్ చేసి ఇండియన్ బాక్స్ ఆఫిస్ హిస్టరిని తిరగరాయడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది అని.. ఆయన పై పాడు కళ్ళు కూడా పడ్డాయని .. ఆ కారణంగానే అల్లు అర్జున్ కి దిష్టి తగిలింది అని ..ఇలా నిందలపాలు అవుతున్నాడు అని ..కుటుంబం భావించిందట.
ఆ కారణంగానే నిన్న అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ కు దిష్టి తీసి మరి ఇంట్లోకి స్వాగతం పలికింది అల్లు ఫ్యామిలీ. అయితే ఇప్పుడు ఆయనను పూర్తిగా దిష్టి నుంచి బయటపడేయడానికి 11 రోజులు అల్లు ఫ్యామిలిలోనే పూజలు చేయబోతున్నారట. హోమాలు కూడా చేయబోతున్నారట . అల్లు అర్జున్ తల్లి కోరిక మేరకే అల్లు అర్జున్ ఈ పూజలు చేయడానికి నిర్ణయించుకున్నారట . పూజలో అల్లుఅర్జున్ - స్నేహారెడ్డి దంపతులుగా పాల్గొనబోతున్నారట . చూడాలి మరి అల్లు ఫ్యామిలీ తీసుకున్న ఈ డెసిషన్ కారణంగా ఆయన అల్లు అర్జున్ పేరు ఇక ట్రోలింగ్కి గురికాకుండా ఉంటుందేమో ..? అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ ఏ ఈవెంట్ కి వస్తాడో..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడా..? అంటూ జనాలు అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు..!