మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర , జయరామ్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలను , ఒక టీజర్ ను కూడా విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన కేరళ థియేటర్ హక్కులను E4 ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. 

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటి నుండే E4 ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను కేరళ లో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: