కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో సూర్య ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించిన తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన తాను నటించిన చాలా సినిమాలను తెలుగు లో విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఈయనకు తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే సూర్య తాజాగా శివ దర్శకత్వంలో కాంగువ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే తాజాగా ఓ తమిళ దర్శకుడు సూర్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఆ దర్శకుడు ఎవరు ..? సూర్య గురించి ఏం మాట్లాడాడు అనే వివరాలను తెలుసుకుందాం.

తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో మిష్కిన్ ఒకరు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా సూర్యా గురించి మాట్లాడుతూ ... మీరు సూర్య కోసం సినిమా చేస్తున్నారా అనే ప్రశ్నకు మిష్కిన్ సమాధానం ఇస్తూ ... నేను అతనికి స్టోరీ చెప్పను. నాకు సినిమా ఇచ్చినా కూడా ఒప్పుకోను. ఆయనతో మూవీ చేయను అని మిష్కిన్ తాజాగా అన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాయి. అలాగే ఈ దర్శకుడు కొన్ని రోజుల క్రితం భారీ అంచనాల నడుమ ఓ పెద్ద సినిమా విడుదల అది ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమాను ప్రేక్షకులు ఏ మాత్రం ఆదరించలేదు. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు ... బ్లాక్ బాస్టర్ చేస్తారు అని మిష్కిన్ తాజాగా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: