అరెస్టు తర్వాత అల్లు అర్జున్ కు మెగా పరామర్శ సరిగ్గా దక్కలేదు .. ఇక టాలీవుడ్ మొత్తం బన్నీ ఇంటికి క్యూ కట్టిన మెగా హీరోలు సరిగ్గా కలవకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపట్ట బాలుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది .. ఆ బాలుడికి హాస్పటల్లో వెంటిలేటర్ సాయంతో వైద్యులు శ్వాస అందిస్తున్నారు .. అలాగే శ్రీ తేజ్ కు పీడియాట్రిక్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది .. ఇక తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ అప్పట్నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 రోజులుగా చికిత్స తీసుకుంటున్నాడు .. ఇక శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. పుష్ప2 డిసెంబర్ 5న రిలీజ్ అయింది..
దానికంటే ముందు ఒకరోజు ముందు డిసెంబర్ 4న ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ హైదరాబాదులోని సంధ్య థియేటర్ కు వెళ్లారు .. ఆ సమయంలోనే తమ అభిమాన హీరోను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు .. ఆ సమయంలో రేవతి అనే మహిళ తన కొడుకు భర్తతో కలిసి దియేటర్ కు వెళ్లారు. అయితే అభిమానులు తాకిడి ఎక్కువ అవటంతో తొక్కిసలాట జరిగింది .. ఈ ఘటనలో రేవతి ఏడేళ్ల శ్రీ తేజ్ కింద పడిపోయారు .. ఆ ఘటనలో రేవతి అక్కడికక్కడే చనిపోయింది.. ఇక శ్రీ తేజ్ మాత్రం హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు.. ప్రజెంట్ శ్రీ తేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది .. ఒకవేళ ఆ బాలుడికి జరగరానిది ఏమైనా జరిగితే అల్లు అర్జున్ కు మరో సమస్య తలెత్తి అవకాశం ఉందని కూడా అంటున్నారు.