తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది భారీ పాపులారిటీ సంపాదించుకున్నవారు ఉన్నారు అలాంటివారిలో లేడీ కమెడియన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ ఫైమా కూడా ఒకరు.. ఈమెకు తన కామెడీ టైమింగ్ తో పంచ్ డైలాగులతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.తనకంటూ ఒక సపరేటు ఫ్యాన్ బేస్  ను కూడా ఏర్పరచుకుంది పైమా.. ఫైమా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో పాటు పలు రకాల స్పెషల్ షోలలో కూడా కనిపిస్తూ ఉంటుంది.


అయితే అప్పట్లో కమెడియన్ ప్రవీణ్ తో కూడా ఫైమా ప్రేమలో ఉన్నట్లుగా తెలియజేసింది. త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారని విధంగా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత బ్రేకప్ జరిగిందని రూమర్స్ కూడా వినిపించాయి. కానీ ఎవరు ఊహించని విధంగా కొన్ని నెలల క్రితం తన బాయ్ ఫ్రెండ్ అని కూడా పరిచయం చేసి అందరికీ సడెన్ షాక్ ఇచ్చింది ఫైమా. అయితే తన బాయ్ ఫ్రెండ్ పేరు కూడా ప్రవీణ్ కావడం గమనార్హం.. అప్పటినుంచి తన లవర్ తో ఉన్న ఫోటోలను సైతం ఈమె షేర్ చేస్తూ ఉన్నది.


అయితే ఇలాంటి సమయంలోనే ఫైమా ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరింత వైరల్ గా మారింది. తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేస్తూ తన బాయ్ ఫ్రెండ్ అయిన ప్రవీణ్ తో దిగిన ఫోటోలను షేర్ చేసి అలాగే 6 ఇయర్స్ కంప్లీట్ అంటూ ఒక పోస్ట్ ని పెట్టింది.. అంతేకాకుండా చాలా హ్యాపీగా ఉందని క్యాప్షన్ కూడా జోడించడం జరిగింది ఫైమా..దీంతో ఆరేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు వీడియోలు చూసిన అభిమానుల సైతం వీరిద్దరూ జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరి జబర్దస్త్ కమెడియన్ ఇంకా పేరు పొందిన పటాస్ ప్రవీణ్ ను ఫైమా మోసం చేసిందా అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: