ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో కావాలనే ఆ బాలుడి ఆరోగ్యం గురించి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని అల్లు అర్జున్ టీమ్ ఆరోపించింది. ఇటీవల ఏదేమైనా ఆ ఫ్యామిలీకి అన్ని విధాలా అండగా ఉంటానని అల్లు అర్జున్ భరోసానిచ్చారని గుర్తు చేశారు. ఆ వార్తలను తీవ్రంగా ఖండిస్తూ శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్తితి ఎలా ఉందో తెలిపారు.  
ఇప్పుడు శ్రీ తేజ్ కు ICU లో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతుందని అన్నారు. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. శ్రీ తేజ్ ఆరోగ్యం మెరుగుపడడానికి వైద్యులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ఆ బాలుడి తండ్రి భాస్కర్ కూడా కేసు ఉపసం‌హరించుకుంటానని తెలిపారు. తన భార్య మరణానికి అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. డిసెంబరు 4న ఘటనకు సంబంధించి ఐకన్ స్టార్ అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్‌ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్‌ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి.. ఆయనను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత ఆయనకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్‌ విధింపుల అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవలే మద్యంతర బెయిల్ ద్వారా స్టార్ హీరో అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: