ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఏ ఇండస్ట్రీకి అయినా 1000 కోట్లు కలెక్షన్ అనేది ప్రెస్టేజ్ ఇష్యూ గా మారిపోయింది .. ఎప్పటికప్పుడు ఎవరికీ ఎన్ని వచ్చాయంటూ లెక్క వేసుకుంటున్నారు .. ఇక తాజాగా పుష్ప2తో తెలుగు చిత్ర పరిశ్రమ ఖాతాలో మరో 1000 కోట్లు సినిమా వచ్చి పడింది. ఇదే క్రమంలో అసలు ఏ ఇండస్ట్రీకి అయినా ఎన్ని 1000 కోట్ల సినిమాలు ఉన్నాయి ? అసలు ఆ క్లబ్లో లేని ఇండస్ట్రియల్ ఏవి ? వాళ్ళు ఎందుకు అందులోకి చేరలేదు..? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 1000 కోట్ల కలెక్షన్ అంటే ఒకప్పుడు ఎంతో పెద్ద విషయంగా కనిపించేది .. కానీ ఇప్పుడు దాన్ని మన హీరోలు మామూలు చిన్న కలెక్షన్లగా మార్చేస్తున్నారు .. ఇప్పటికే మన తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో ఈ ఫీట్ ను ప్రభాస్ రెండుసార్లు సాధించారు.


రామ్ చరణ్ , యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ఒకసారి 1000 కోట్ల మార్క్ కలెక్షన్ అందుకున్నారు .. ఇక ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కూడా తొలిసారి ఈ క్లబ్ లోకి అడుగుపెట్టారు. ఇలా మొత్తంగా తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు 1000 కోట్లు కలెక్షన్ రాబెట్టిన సినిమాలు ఉన్నాయి. భారతీయ సినిమాకు 1000 కోట్ల కలెక్షన్ ను పరిచయం చేసింది తెలుగు సినిమా .. బాహుబలి 2 సినిమాతో మొదటిసారిగా 2017 లో ఈ మార్కు అందుకుంది టాలీవుడ్ . ఆ తర్వాత మళ్లీ 5 సంవత్సరాలకు 2022 లో త్రిబుల్ ఆర్ తో రెండోసారి .. అలాగే 2024 లో కల్కి సినిమాతో మూడోసారి.. ఇప్పుడు తాజాగా పుష్ప 2 తో నాలుగోసారి తెలుగు సినిమాలు 1000 కోట్ల కలెక్షన్ రాబట్టాయి .


మన తెలుగు చిత్రం పరిశ్రమ తర్వాత బాలీవుడ్ నుంచి జవాన్ , పఠాన్ రూపంలో రెండు 1000 కోట్ల సినిమాలు ఉన్నాయి .. అలాగే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కేజిఎఫ్ 2 సినిమాతో ఓసారి 1000 కోట్ల మార్క్ అందుకుంది. అయితే తమిళ సినిమాలు ఈ మార్క్ కలెక్షన్లకు కనుచూపు మేరలో కూడా రావటం లేదు .. 500 కోట్లు వర్క్ ఓకే గాని 1000 మాత్రం కోలీవుడ్ సాధించలేక పోతుంది.. క్రమంలో మలయాళ సినిమాలు కూడా 1000 కోట్ల కలెక్షన్లకు దూరంగానే ఉంటున్నాయి .. ఇండియన్ చిత్ర పరిశ్రమలో ప్రజెంట్ టాలీవుడ్ డే నెంబర్ వన్ స్థానంలో అప్పర్ హ్యాండ్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: