చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎదిగి రాణించాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది .. అలాగే నటనపై ఆసక్తితో  చిత్ర పరిశ్రమలో చాలామంది అడుగు పెడుతూ ఉంటారు .. సినిమానే తమ కెరియర్ గా మార్చుకుని తాము చదువుకునే చదువుకు కూడా గుడ్ బాయ్ చెప్పి హీరోయిన్గా సినిమాల్లో నటిస్తూ ఉంటారు..  ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్ సైతం పైన చెప్పిన జాబితాలోకి వస్తుంది .. హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడానికి తాను ఎంతో ఇష్టపడి చదివిన సైకాలజీ డిగ్రీకి పుల్ స్టాప్ పెట్టింది.. సినిమాల్లోకి రాకముందు పలు కమర్షియల్ యాడ్స్ లో నటించింది.. ఆ తర్వాత తెలుగు , హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.


ఇక మన తెలుగు ప్రేక్షకులు సైతం ఆమె ఎంతో సుపరిచితురాలు .. ఇంత‌కి ఈ హీరోయిన్ మరెవరో కాదు .. ఆ ముద్దుగుమ్మ పేరు అమృతారావు .. ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టలేరు కానీ .. మహేష్ హీరోగా వచ్చిన అతిధి సినిమా హీరోయిన్ అంటే అందరికీ గుర్తుకు వస్తుంది. చదువుకునే రోజుల్లో తన సోదరి ప్రీతికాతో కలిసి వోహ్ ప్యార్ మేరా అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది .. ఇక అప్పటినుంచి ఈమెకు సినిమా రంగంపై ఇంట్రెస్ట్ ఏర్పడింది .. ఆ ఇంట్రెస్ట్ తో 2002లో ఆర్య బబ్బార్ తో కలిసి అబ్ కే బరస్  అనే హిందీ సినిమాలో నటించింది .. మొదటి సినిమాతోనే మంచి నటిగా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు తెచ్చుకుంది .. తర్వాత బాలీవుడ్ లో అజయ్ దేవగన్ కు జంటగా ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ సినిమాలో నటించింది .. ఈ సినిమాతో అమృత క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది .. 2003లో ఇష్క్ విష్క్ ,  2005లో వాహ్ లైఫ్ హో తో ఐసీ, 2006లో వివాహ్ వంటి సినిమాలో నటించి అదరగొట్టింది ..


టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు జంటగా అతిధి సినిమాలో కూడా నటించింది .. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది .. దాంతో తెలుగులో ముద్దుగుమ్మకు సరైన అవకాశాలు రాలేదు.  స్టార్ హీరోయిన్గా చిత్ర పరిశ్రమ లో ఒక వెలుగు వెలగాలని చదువును మధ్యలో వదిలేసిన ఈ ముద్దుగుమ్మకు సరైన క్రేజ్ మాత్రం రాలేదు.. అయితే 2016లో ఆర్జే అన్మోల్ ను పెళ్లి చేసుకుంది .. ఆ సమయంలో వీరి పెళ్లి కోసం 1.5 లక్షలు మాత్రమే ఖర్చయింది .. తన పెళ్లి కోసం కేవలం 3000 రూపాయల చీర మాత్రమే కొనుక్కుంది .. 2019లో చివరిసారిగా ‘థాక్రే’  అనే సినిమాలో నటించిన తర్వాత అమృతా సినిమాలకు దూరమైంది .. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో  యాక్టివ్ గా ఉంటారు అమృత .

మరింత సమాచారం తెలుసుకోండి: