అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే హైడ్రాను రంగంలోకి దింపి స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఎన్-కన్వెన్షన్ ను కూల్చివేయడం జరిగింది. అనంతరం హీరో అక్కినేని నాగచైతన్య, టాలీవుడ్ హీరోయిన్ సమంత విడాకుల విషయంలో కూడా దూరి తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇటీవల ఆయన అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే సినీ ఇండస్ట్రీ గురించి కూడా రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడారు.
ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హీరోలు సినిమాలు తీస్తారు, డబ్బులు సంపాదించుకుంటారని అన్నారు. వాళ్లేం పెద్ద హీరోలు కాదని తెలిపారు. సినీ నటులు సరిహద్దుల్లో యుద్ధాలు చేసేవారు కాదని.. దేశాన్ని చూసి ప్రపంచం గర్విచేలా ఏవైనా విజయాలు సాధించారా వాళ్లు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అంతా ఏకతాటిపైకి వచ్చి సర్కార్‌కి వ్యతిరేకంగా మారింది. ఇకపై మార్పు రాకపోతే.. వేరే రాష్ట్రాలకు తరలి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని వారందరూ డిసైడ్ అయినట్ల సమాచారం. ఇక ముందు ముందు ఇది ఏ మలుపు తిరుగుతుందో.. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.