ఏపీ ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్‌కు, మెగా ఫ్యామిలీకి విభేదాలు మొదలయినప్పటి నుండి ఒకరి పేరును మరొకరు కనీసం ప్రస్తావించడం లేదు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'పుష్ప 2' రిలీజ్‌కు కూడా మెగా హీరోలు సపోర్ట్ చేయలేదు. కేవలం సాయి ధరమ్ తేజ్ మాత్రమే సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ టీమ్‌కు విషెస్ తెలిపాడు. దానికి బన్నీ కూడా రిప్లై ఇచ్చాడు. బన్నీ అరెస్ట్‌తో మళ్లీ అందరూ ఒక్కచోట చేరారు. మెగా ఫ్యామిలీ అంతా అల్లు అర్జున్‌కు ఎప్పటికైనా అండగా ఉంటుందని మరోసారి నిరూపించింది.ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూ, ఆయన మేనమామ సోదరుడు అయిన పవన్ కళ్యాణ్ కు మధ్య కొంతకాలంగా నెలకొన్న గ్యాప్ తగ్గించేందుకు తాజాగా ప్రయత్నించారు. తన తాజా చిత్రం పుష్ప 2 టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి గతంలోనే పోస్ట్ చేసిన అల్లు అర్జున్.. తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను బాబాయ్ అంటూ అల్లు అర్జున్ పిలిచిన పిలుపు చర్చనీయాంశమైంది.తన తండ్రి అల్లు అరవింద్ కు సోదరి అయిన మేనత్త సురేఖకు భర్త అయిన చిరంజీవికి సోదరుడైన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కు వరసకు మేనమామే అవుతారు.

 అయితే అల్లు అర్జున్ మాత్రం తాజాగా పుష్ప 2 సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ను బాబాయ్ గా సంబోధించడంతో అక్కడున్న వారితో పాటు అభిమానులూ ఆశ్చర్యపోతున్నారు. అయితే కారణం లేకుండా ఏదీ చేయడనే పేరున్న అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో తనకు ఉందని భావిస్తున్న వైరానికి పుల్ స్టాప్ పెడుతూనే ఇలా బాబాయ్ అంటూ కలుపుకోవడం చర్చకు కారణమైంది.ఇదిలావుండగా చిన్నప్పటి నుండి రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో పాటు అల్లు కుటుంబానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు కలిసి పెరిగారు. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌ను బాబాయ్ అని పిలిచేవారట. అలాగే అల్లు అర్జున్‌కు కూడా అలా పిలవడమే అలవాటుగా మారింది. రామ్ చరణ్ కూడా నాగబాబు, పవన్ కళ్యాణ్‌ను బాబాయ్ అనే పిలుస్తాడు. అలా ఆ ఇంట్లో బాబాయ్ అనే పిలుపు ఎక్కువగా వినిపించేది కాబట్టి అందరికీ అదే అలవాటు అయిపోయింది. అల్లు అర్జున్.. చిక్ బాబాయ్ అని పిలుస్తాడనే విషయం చాలా తక్కువమందికి తెలుసు. చిన్నప్పటి నుండి అలవాటైన పిలుపు కాబట్టి ఇప్పటికీ చిరంజీవిని బన్నీ అలాగే పిలుస్తాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: