ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఓ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.. ఆయనకు సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టాయి. మరి ఇంతకీ ప్రభాస్ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.చాలా రోజుల నుండి ప్రభాస్ హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ ఇది నిజం అవ్వడం లేదు. అయితే గత కొద్ది రోజులుగా ప్రభాస్ పెద్దమ్మ అయినటువంటి శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి ఈ ఏడాది ఉండబోతుంది.. వచ్చే ఏడాది ఉండబోతుంది అంటూ ఇలా చెప్పుకుంటూ వస్తుంది కానీ అది జరిగింది లేదు మనం చూసింది లేదు అన్నట్లు ఈమె మాటలు వింటే అర్థమవుతుంది. ఎందుకంటే చాలాసార్లు శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చినప్పటికి అది జరగలేదు.

 అయితే వచ్చే ఏడాది మాత్రం ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని గట్టిగా చెప్పింది. కానీ ప్రభాస్ తీరు చూస్తే మాత్రం అలా అనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్.ఓ సినిమా షూటింగ్ నుండి ఏమాత్రం గ్యాప్ దొరికినా కూడా మరో సినిమా షూటింగ్లో దూరిపోతున్నారు ప్రభాస్.అలాంటి ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి సమయం ఎక్కడ ఉంటుంది అని చాలామంది ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.అయితే ఇలా బిజీ బిజీగా గడుపుతున్న వేళ ప్రభాస్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ ఆయనకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.


మరి ఇంతకీ ఆ ఫోటోలో ఏముందయ్యా అంటే.. ప్రభాస్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇద్దరు రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఇద్దరి మెడలో పూలదండలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫొటోస్ చూస్తే అచ్చం ప్రభాస్ అనుష్క లాగే అనిపిస్తారు. కానీ అది నిజమైన అనుష్క ప్రభాస్ లు కాదు.ఎందుకంటే అది ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఫోటో.. ఏఐ ద్వారా ప్రభాస్ అనుష్క శెట్టి ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఒక పిక్చర్ ని క్రియేట్ చేశారు ఫ్యాన్స్..ఇక ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో అబ్బా ఇది నిజమైతే ఎంత బాగుండో అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి కొంత మందేమో ఏంటి ప్రభాస్ సీక్రెట్ గా అనుష్క శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారా అని ఆశ్చర్యపోతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: