అయితే ఈ సందర్భంగా.. చాలామంది ప్రముఖులు వచ్చారట. అయితే మోహన్ బాబు సతీమణి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో కరెంటు ఒక్కసారిగా పోయిందట. దీంతో జనరేటర్... ఆన్ చేద్దామని మంచి కుటుంబానికి సంబంధించిన.. వారు ట్రై చేశారట. ఆ సమయంలో జనరేటర్ లో పంచదార పోసినట్లు... మంచు మనోజ్ కుమార్ గుర్తించారు. అయితే ఇది మంచు విష్ణు కుమార్ చేసి ఉంటాడని... మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ అంశాన్ని... తెరపైకి తీసుకువచ్చి మంచు మనోజ్ మళ్ళీ గొడవలు సృష్టించాడు. తనతో పాటు కుటుంబ సభ్యులను కరెంట్ ఫిక్షన్... చేసి చంపాలని చూస్తున్నాడని... మంచు విష్ణు ను ఉద్దేశించి మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనతోపాటు భార్యా పిల్లలు తల్లిని చంపే... కుట్ర జరుగుతోందని తెలిపాడు. వారం రోజుల కిందట కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేశానని.. తాజాగా మళ్లీ పేర్కొన్నాడు. వాళ్లు ఇప్పుడు మా ఇంట్లో వచ్చి కుట్ర చేశారని మంచు మనోజు సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఈ సంఘటనపై మరోసారి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. కాగా అన్నదమ్ముల గొడవలు నేపథ్యంలో మంచి మోహన్ బాబు అలాగే ఆయన భార్య ఇటీవల ఆసుపత్రి పాలు అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మీడియాపై దాడి చేశాడు మోహన్ బాబు. ఈ సంఘటన మరువక ముందే ఇప్పుడు మళ్లీ పంచదార గొడవ తెరపైకి వచ్చింది.