గంగవ్వ నన్ను గట్టిగానే తిట్టిందంటూ గేమ్ ఛేంజర్ సీన్ ను రామ్ చరణ్ లీక్ చేసేశారు. గంగవ్వతో నాకు పరిచయం ఉందని గేమ్ ఛేంజర్ సినిమాలో ఇద్దరూ కలిసి చేశామని చరణ్ అన్నారు. నన్ను చాలా గట్టిగా తిట్టారని రామ్ చరణ్ పేర్కొన్నారు. మీ ఉద్యోగం సరిగ్గా చేయడం లేదని మా పేదోళ్లకు ఏమైనా చేయాలంటూ తిట్టారని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.
గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కు మరో 24 రోజుల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే చర్చ జరుగుతోంది. రామ్ చరణ్ బిగ్ బాస్ షోకు విజేతగా రావడం ఈ షోకు కళను తెచ్చిపెట్టిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రోహిణి గారిని సెట్లోనే కలిశానని రామ్ చరణ్ వెల్లడించడం గమనార్హం.
బిగ్ బాస్ సీజన్8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మాత్రం అదిరిపోయిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. జనవరి 1వ తేదీన ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని అభిమానులు ఫీలవుతున్నారు.