టాలీవుడ్ హీరోలలో ఒకరైన మంచు మనోజ్ కు సోషల్ మీడియా వేదికగా క్రేజ్ పెరుగుతుండగా మనోజ్ చేతిలో ఎక్కువ సంఖ్యలో సినిమా ఆఫర్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. మంచు మనోజ్ తన తల్లి గురించి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. నీవల్లే అంతా కలిసున్నాం.. నీకు ఎప్పుడూ తోడుగా ఉంటానమ్మా అంటూ మనోజ్ ఎమోషనల్ అయ్యారు.
 
మనోజ్ తన తల్లి పుట్టినరోజు సందర్భంగా తల్లితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ.. మన ఫ్యామిలీకి నువ్వు హృదయంలాంటిదానివని మనోజ్ చెప్పుకొచ్చారు. నీ ఆత్మధైర్యం నన్ను ప్రతిరోజు ఇన్‌స్పైర్‌ చేస్తుందని నీ ప్రేమాభిమానాల వల్లే అందరం కలిసి ఉండగలుగుతున్నామని మనోజ్ కామెంట్లు చేయడం గమనార్హం.
 
నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, సంతోషంగా ఉండాలని నేను ఫీలవుతున్నానని మనోజ్ చెప్పుకొచ్చారు. ఏం జరిగినా తన తల్లి తనకు ఎప్పుడూ అండగా నిలబడిందని మనోజ్ కామెంట్లు చేశారు. అదే విధంగా అమ్మకు నేను కూడా తోడుగా ఉంటానని మనోజ్ పేర్కొన్నారు. నిన్ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను తల్లీ అంటూ మంచు మనోజ్ కామెంట్లు చేశారు.
 
మంచు కుటుంబంలో ఉన్న చిన్నచిన్న గొడవలు పరిష్కారం అయ్యి అందరూ కలిసిమెలిసి ఉండాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గొడవలు మరింత పెద్దవయ్యే ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. మంచు ఫ్యామిలీ వివాదాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాల్సి ఉంది. మంచు ఫ్యామిలీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. మంచు మనోజ్ ప్రస్తుతం మిరాయ్, వాట్ ది ఫిష్ సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రం మనోజ్ కెరీర్ పరంగా మరింత బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: