తాజాగా స్టార్ హీరో అక్కినేని నాగార్జున టేస్టీ తేజకు బంపర్ ఆఫర్ ఇవ్వడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజకు నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చారు. గత సీజన్ లో శోభాశెట్టి అడిగిన వెంటనే నాగార్జున తన షర్ట్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే అమర్ దీప్ అడిగిన సమయంలో మాత్రం నాగార్జున షర్ట్ ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు.
టేస్టీ తేజ సైతం తనకు చొక్కా కావాలని అడగగా తేజ సన్నబడితే షర్ట్ ఇస్తానని నాగార్జున హామీ ఇచ్చారు. అయితే టేస్టీ తేజ మాత్రం బరువు తగ్గలేదు. నాగార్జున షర్ట్ కావాలనే కోరిక టేస్టీ తేజకు మిగిలిపోగా నాగార్జున టేస్టీ తేజతో మాట్లాడుతూ మొదట పెళ్లి ఫిక్స్ చేసుకోవాలని పెళ్లి డ్రెస్ ఫిక్స్ చేస్తానని హామీ ఇచ్చారు. నాగార్జున నుంచి బంపర్ ఆఫర్ లభించడంతో టేస్టీ తేజ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
టేస్టీ తేజ పెళ్లికి సంబంధించిన శుభవార్తను ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు రామ్ చరణ్ గెస్ట్ గా రావడం ఈ సీజన్ కు ప్లస్ అయింది. ఫినాలే ఎపిసోడ్ రేటింగ్స్ పరంగా అదరగొట్టడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షో సీజన్8 విజేతకు ఫ్రైజ్ మనీని పెంచిన నేపథ్యంలో ఈ షోపై ఆసక్తి చూపిస్తున్న కంటెస్టెంట్ల సంఖ్య పెరుగుతోంది.