తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో పెద్ద హీరో సినిమా విడుదల అయినా , భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా విడుదల అయినా కూడా వెంటనే ఓ కాంట్రవర్సీ పుట్టుక వస్తుంది. అలాంటి కాంట్రవర్సీ ఏమిటి అనుకుంటున్నారా ..? అదే టికెట్ రేట్ల పెంపు. చిన్న హీరోల సినిమాలు , మామూలు బడ్జెట్ తో రూపొందిన సినిమాలకు టికెట్ రేట్ ల పెంపు ఏ మాత్రం ఉండడం లేదు. సాధారణంగా ప్రభుత్వాలు నిర్ణయించిన రేటుకే అలాంటి సినిమాలు విడుదల అవుతున్నాయి.

వాటి ద్వారా సినిమా బాగుంటే ప్రేక్షకులు కూడా తక్కువ టికెట్ రేట్ ఉంటుంది కాబట్టి సినిమాలు చూస్తున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలు , భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాల విషయంలోనే అసలు సమస్య మొదలయ్యింది. స్టార్ హీరోల సినిమాలకు దాదాపుగా ఎక్కువ బడ్జెట్ అవుతూ ఉంటుంది. దానితో మేము భారీ బడ్జెట్ను సినిమా కోసం ఖర్చు పెట్టాం. మేము పెట్టిన ఖర్చు తొందరగా వెనక్కి రావాలి అంటే టికెట్ రేట్లు పెంచాలి అని ప్రభుత్వాల దగ్గరకు సినిమా యూనిట్స్ వెళ్లడం , వారు కూడా ఈ మధ్య కాలంలో టికెట్ రేట్లు భారీగా పెంచుకోవడానికి అనుమతులు ఇస్తూ వస్తున్నారు. ఇలా టికెట్ రేట్లు భారీగా పెంచడానికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో కొంత మంది సాధారణ చిన్న , మధ్య తరగతి ప్రేక్షకులు అంత పెద్ద మొత్తంలో సినిమా టికెట్ ధరలు పెంచితే మామూలు ప్రేక్షకులు థియేటర్ కు వెళతారా ..? అసలు మామూలు ప్రేక్షకుల ద్వారానే సినిమాలు నడుస్తున్నాయి.

అతనికే సినిమాని దూరం చేస్తే ఎలా అనే వాదనలు వస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో విడుదల అయిన స్టార్ హీరోల సినిమాలలో దాదాపు అన్ని సినిమాలకు టికెట్ ధరలను భారీగా పెంచారు. దానితో ప్రతి సారి ప్రజలు ఇంత పెద్ద మొత్తంలో టికెట్ ధరలు పెంచుతారా అని వాదించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: