ఏంటి ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య శోభిత పై ట్రోల్సా..ఇదేంటి ఇంతలా ట్రోల్స్ చేస్తున్నారు.ఇంతకీ శోభిత చేసిన తప్పేంటి..నాగచైతన్య కాళ్ళ కింద శోభిత బానిస అంటూ ట్రోల్స్ రావడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.. నాగచైతన్య శోభిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే ఎన్నో మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సమయం దొరికినప్పుడల్లా శోభిత ధూళిపాళ్ల తన భర్తతో పెళ్లిలో జరిగిన ఎన్నో సంతోషకరమైన క్షణాలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటుంది. అలా ఇప్పటికే ఎన్నో ఫొటోస్ షేర్ చేసుకుంది శోభిత దూళిపాళ్ల  తాజాగా నాగచైతన్య శోభిత మెడలో తాళి కాడుతుండగా శోభిత  తన భర్త అయినటువంటి నాగచైతన్య కాళ్లు మొక్కింది. 

అయితే ఈ కాళ్ళు మొక్కిన ఫోటోని అభిమానులతో షేర్ చేసుకున్న శోభిత ధూళిపాళ్లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అయితే భర్త కాళ్లు భార్యా మొక్కడంలో ట్రోల్స్ రావడం ఏంటి అని మీ అందరికీ అనుమానం రావచ్చు. కానీ సినీ సెలెబ్రిటీల విషయంలో ఏదైనా హాట్ టాపికే..దేన్నైనా ట్రోల్స్ చేయగలరు. అలా నాగచైతన్య కాళ్లను మొక్కిన శోభితపై ట్రోల్స్ వస్తున్నాయ్.శోభిత ఏమైనా బానిసనా.. ఈ యుగంలో కూడా ఇలా కాళ్ళు మొక్కడం ఏంటి.. మగవాడు అనే అహంకారమా..ఫెమినిజం అంటూ సోషల్ మీడియాలో శోభితపై ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు పెళ్లిలో ఇలాంటివి సహజం..


కానీ ఇలా ఫొటోస్ షేర్ చేయడం వల్ల అబ్బాయిలు అంటే పడని కొంతమంది అమ్మాయిలు ఈ ఫోటోపై ట్రోల్స్ చేస్తున్నారు. అయితే పెళ్లి అంటే కచ్చితంగా ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి  ముఖ్యంగా శోభిత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది.అలాగే హిందువులు కాబట్టి..ఇలాంటి సాంప్రదాయాలు ఉంటాయి. ఇక పెళ్లిలో భాగంగా తాళి కట్టాక భర్త కాళ్లను మొక్కడం సాంప్రదాయం.కానీ ఇలాంటి సాంప్రదాయాల మీద కూడా బానిసత్వం, ఫెమినిజం అంటూ ట్రోల్స్ చేయడం ఏమాత్రం బాగాలేదని కొంతమంది స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: