పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడంతో ఈ ఘటన దురదృష్టవశాత్తు రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.. అతని కుమారుడు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఈ కేసులో అల్లు అర్జున్ ని కూడా అరెస్టు చేయడం ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారింది.. అల్లు అర్జున్ కి సంబంధించి చాలా మంది కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం అరెస్టుని సైతం ఖండించారు. అయితే ఇప్పుడు తాజాగా సీనియర్ నటుడు అయినా సుమన్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.



అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం ముమ్మాటికి తప్పే అంటూ ఫైర్ అయ్యారు హీరో సుమన్.. హీరో థియేటర్ కి పిలిచినప్పుడు సెక్యూరిటీ బాధ్యత థియేటర్ యాజమాన్యమే తీసుకోవాలి అని క్రౌడ్ తగ్గట్టుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఒక యాక్టర్ గా థియేటర్ కి వెళ్లడం అల్లు అర్జున్ చేసింది తప్పేమీ కాదని ఈ ఘటన ఒక హెచ్చరిక దయచేసి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని హీరోలను థియేటర్లకు పిలిచండి అంటూ యాజమాన్యాలకు తెలియజేశారు హీరో సుమన్.


అలాగే ఒక కుటుంబంలో ఒక ప్రాణం పోయింది ఆ కుటుంబానికి ఆ బాధ తీర్చలేనిది ఒక అభిమాని ప్రాణం కోల్పోవడం అంటే అది చాలా బాధాకరం గతంలో ఎన్నో సంఘటనలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వీటి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు వాళ్లకు ఒక రూల్ అల్లు అర్జున్ కి ఒక రూలా అంటూ ఫైర్ అయ్యారు హీరో సుమన్.. తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ఆరోగ్యం పైన కూడా అల్లు అర్జున్ స్పందించడం జరిగింది. త్వరలో ఆ బాలుడని కలుస్తానంటూ అల్లు అర్జున్ నిన్నటి రోజున మరొకసారి ట్విట్ చేశారు.. ప్రస్తుతం తాను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని అతని కుటుంబాన్ని కూడా కలుస్తానని.. శ్రీ తేజ్ నీ కలవకూడదని కోర్టు తెలియజేసింది. వైద్య కుటుంబ పరమైన అవసరాలను కచ్చితంగా తీరుస్తానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: