- ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు ఆయన ఒకరోజు రాత్రంతా జైలులో ఉండటం జైలు నుంచి రిలీజ్ కావటం .. ఆ తర్వాత మీడియాలో జరిగిన చర్చ సోషల్ మీడియాలో జరిగిన హంగామా జాతీయ స్థాయిలో బన్నీ పేరు మార్మోగిపోవటం .. సెలబ్రిటీల పరామర్శలు ఇలా గత మూడు నాలుగు రోజులుగా ఎక్కడ చూసినా దేశ వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. ఓవైపు బన్నీ నటించిన పుష్ప సినిమా 10 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రు.1200 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఈ టైంలో పుష్ప సినిమా కలెక్షన్ల గురించి జరగటం కంటే అటెన్షన్ అంతా బన్నీ అరెస్టు జైలు శిక్ష రిలీజ్ గురించి నడుస్తోంది. ఇక మరో చ‌ర్చ‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్ల కావాలని ఒక రోజంతా జైల్లో ఉంచేలా చేశారన్న చర్చలు కూడా కొందరు తెరమీదకు తెస్తున్నారు. ఏ సెలబ్రిటీ అయినా సహజంగా కొందరు పేర్లు మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. కొందరు ఒకరి పేరు గుర్తు రానట్టు ప్రవర్తించడం .. పేరేంటి అని పక్కన వాళ్ళని అడగటం ? ఆ వ్యక్తి కన్నా తన లెవెల్ చాలా ఎక్కువ అని సంకేతంగా చెప్పడానికో చేస్తూ ఉంటారు. ఇగో సెంట్రిక్ మనుషులు అలాంటి పనులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు.


అల్లు అర్జున్ ఇలా ఏమైనా చేశాడా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. సహజంగా చిన్నపిల్లలకు కూడా ముఖ్యమంత్రి పేరు గుర్తు ఉంటుంది. అలాంటిది బన్నీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడంతో పాటు దానిని ఎవరికి తెలియకుండా కవర్ చేసుకోకుండా .. పేరు మర్చిపోయాను అని చెప్పటం కూడా బన్నీ లాంటి స్థాయి వ్యక్తికి ఏమాత్రం సరితూగదు అని చెప్పాలి. మరికొందరు అయితే అల్లు అర్జున్ లో కనిపించని రాంగోపాల్ వర్మ ఉన్నాడని చెబుతున్నారు. మీడియా అటెన్షన్ కోసం ఏదో ఒక తుంటరి పని చేయడానికి అతనికి సరదా అని .. ఇలాంటివి తనకి కొత్త కాదని ప్రతి ఈవెంట్ లోను ఏదో ఒక చర్య చేసి డిస్కషన్ లేవదీయటానికి ప్రయత్నిస్తాడని అనేవాళ్ళు ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో చెప్పను బ్రదర్ అనటం కానీ .. తాజాగా దర్శకుడు సుకుమార్ పేరుని బండ్రెడ్డి సుకుమార్ రెడ్డి అని చెప్పటం వెనుక కూడా ఇదే కారణం అంటున్నారు. సుకుమార్ రెడ్డి కాదు కానీ ఆ తోక తగిలించేసరికి అలా ఎందుకు అన్నాడు ? పొరపాటున ఇంకా ఏదైనా కారణం ఉందా అన్న చర్చలు మొదలయ్యాయి.. అల్లు అర్జున్ ఏదోలా ఇలా వార్తల్లో ఉండేందుకు ఇష్టపడుతున్నారా అన్న అనుమానాలు కూడా కొందరిలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: