* పాజిటివ్ రావడంతో అరెస్ట్..
* హేమా జీవితంపై మాయని మచ్చ..
దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సుమారుగా 100 మందికి పైగా పాల్గొన్నట్లుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా హైదరాబాద్ కి చెందిన ఒక బిజినెస్ మాన్ బర్త్ డే సందర్భంగా ఈ పార్టీ జరగగా.. ఇందులో చాలామంది సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో టాలీవుడ్ నటి హేమ కూడా పాల్గొన్నట్లు తెలిసిన విషయమే. దీంతో జూన్ మూడవ తేదీన నటి హేమా ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.
సన్ సెట్ టు సన్రైజ్ విక్టరీ అనే పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ పార్టీ ఉదయం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అత్యధికంగా డీజే సౌండ్ పార్టీతో జరిగిందట ఈ సౌండ్ వల్ల ఇరుగుపొరుగువారు ఇబ్బందులకు గురై ఫిర్యాదు చేయడంతో పోలీసులు రావడంతో.. ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లుగా తనిఖీ చేయడం జరిగింది. దీంతో అక్కడ అధికారులు చెక్ చేయగా ఎండిఎంఏ పిల్స్, హైడ్రోగంజా, కొకైన్ వంటి పదార్థాలను ఉపయోగించినట్లుగా గుర్తించారు.
అయితే మొదట ఈ రేవ్ పార్టీలో నటి హేమ.. తాను పాల్గొనలేదని తెలియజేసినా.. చివరికి అధికారులు హేమాను విచారించి, వైద్య పరీక్షలు చేయించగా అన్నీ కూడా పాజిటివ్ రావడంతో నటి హేమాకు నోటీసులు పంపించారు. దీంతో ఎన్నిసార్లు నోటీసులు పంపించినా కూడా హేమా రియాక్ట్ కాకపోవడంతో డైరెక్ట్ గా బెంగళూరు నుంచి పోలీసులు హైదరాబాద్ కు రావడం జరిగింది. దీంతో రేవ్ పార్టీ విషయంలో హేమ అరెస్టు చేయగా.. కొద్ది రోజులు అనంతరం నటి హేమ బెయిల్ మీద బయటకు వచ్చారు.
ఇక ఆ తర్వాత హేమ కి సంబంధించి ఎటువంటి వ్యవహారం కూడా వినిపించలేదు. అయితే ఈ ఏడాది నటి హేమ మీద వచ్చినటువంటి ఈ మచ్చ మాయని మచ్చగా మిగిలిపోతుందని అభిమానులు సైతం వాపోతున్నారు. మరి వచ్చే ఏడాది అయినా హేమకు అవకాశాలు లభిస్తాయో చూడాలి.