- ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) . .


టాలీవుడ్ ఐకాన్ స్టార్ పుష్ప 2 సినిమా దెబ్బ కు ఎక్కడికో వెళ్లిపోయాడు. సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ జనాలు ఎంత ఆసక్తితో ? ఎదురు చూసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియా సినీ ప్రేమికుల కంటే నార్త్ ఇండియా సినీ ప్రేమికుల అయితే పుష్ప 2 ఎప్పుడు చూస్తామా ? అని ఒకటే కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరి ఎదురు చూశారు. పది రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రు. 1200 కోట్ల వసూళ్లు సాధించి తిరుగులేని రికార్డులు నమోదు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర ఇంకా గర్జిస్తూ దూసుకుపోతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమా రిలీజ్ కి ముందు రోజు హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ దగ్గర స్పెషల్ ప్రీమియర్ షో కు అల్లు అర్జున్ హాజరయ్యారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు.


రేవతి కుమారుడు కూడా ప్రాణాపాయ స్థితిలో హైదరాబాదులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లు అర్జున్ అరెస్టు చేసి ఒక రాత్రంతా జైల్లో ఉండి మరుసటి రోజు ఉదయం బెయిలు పై బయటకు వచ్చారు. ఈ దెబ్బకు అల్లు అర్జున్ క్రేజ్ .. అల్లు అర్జున్ గురించి చర్చ దేశ‌ వ్యాప్తంగా మారు మోగిపోయింది. జాతీయ మీడియాలో అర్నాబ్‌ గోస్వామి లాంటోళ్లు సైతం ప్రత్యేకంగా చర్చలు పెట్టారంటే అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయిలో ? ఉందో తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రేజీ దేశవ్యాప్తంగా ఎలా పాపులర్ ? అయిందో ఈ దెబ్బతో బన్నీ క్రేజ్‌ కూడా అలా దేశవ్యాప్తంగా మారు మోగిపోతుంది. ఏదేమైనా బ‌న్నీ ఇప్పుడు నేష‌న‌ల్ క్రేజీ స్టార్ అన‌డం లో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: