టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఏ స్థాయిలో మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ ఫ్యామిలీ సాధారణంగా వివాదాలకు దూరమనే సంగతి తెలిసిందే. అయితే కొండా సురేఖ వివాదం మాత్రం ఒక విధంగా నాగార్జున ఫ్యామిలీ పరువు తీసిందని చెప్పవచ్చు. ఈ ఏడాది భారీ కాంట్రవర్సీలలో ఈ వివాదం ఒకటిగా నిలిచిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
 
కొండా సురేఖ చేసిన కామెంట్లు అటు నాగ్ అభిమానులను, ఇటు సమంత అభిమానులను ఎంతగానో బాధించాయి. కొండాసురేఖ నాగార్జున వివాదానికి సంబంధించ్ ప్రస్తుతం కోర్టు కేసు నడుస్తున్న సంగతి తెలిసిందె. ఈ వివాదం నాగార్జున కెరీర్ లో చెరగని మచ్చగా మిగిలిందని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నాగార్జున సైతం కొండా సురేఖ కామెంట్లను సీరియస్ గా తీసుకున్నారు.
 
నాగార్జున బిగ్ బాస్ షో సీజన్8 ను సైతం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. నాగార్జున కూలీ, కుబేర సినిమాలలో కీలక పాత్రల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున ఈ మధ్య కాలంలో తన రెమ్యునరేషన్ ను సైతం ఊహించని స్థాయిలో పెంచేశారు. నాగార్జున ప్రస్తుతం 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
 
నాగార్జున తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. కెరీర్ విషయంలో నాగార్జున ఆచితూచి అడుగులు వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాగార్జున సోలో హీరోగా సైతం త్వరలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. నాగార్జున బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాగార్జున తర్వాత సినిమాలపై సైతం అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశాలపై హీరో  నాగ్ ఎక్కువగా దృష్టి పెడుతున్నారని సమాచారం అందుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: