సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ 11 నిందితుడిగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు తెలంగాణా పోలీసులు. అంతేకాదు జైలుకు వెళ్లి ఒక రోజు నిద్ర కూడా చేసి వచ్చారు. ఆ కారణంగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు . అయితే ఇదే మూమెంట్లో వేణు స్వామి పేరు హైలెట్గా మారింది. వేణు స్వామి ఎవరి పేరు చెప్తే వాళ్ళు ఢమాల్ అంటూ పడిపోతున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు . గతంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారం చేపట్టబోతుంది అంటూ బల్ల గుద్ది మరీ చెప్పాడు వేణు స్వామి .
అయితే సీన్ ఎలా రివర్స్ అయిందో అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అతి దారుణంగా ఏపీ కూటమి చేతిలో ఓడిపోయాడు. అల్లు అర్జున్ విషయంలో కూడా వేణు స్వామి చాలా గొప్పగా పొగిడారు. అల్లు అర్జున్ ని ఎవరు టచ్ చేయలేరు అని ..ఆ స్థాయికి ఎదిగిపోతాడు అని చెప్పుకొచ్చారు. అయితే పుష్ప రాజ్ సినిమాతో ఆ స్థాయికి వెళ్లిన ఇలా జైలుకు వెళ్లి మాత్రం తన పరువు మొత్తం తీసేసుకున్నాడు . దీన్నే సోషల్ మీడియాలో జనాలు వెలేత్తి చూపిస్తున్నారు. నువ్వు ఎవరి పేరు చెప్తే వాళ్ళు సర్వనాశనం అయిపోతున్నారు అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు..!