అల్లు అర్జున్ ఏది చేసిన సరే చాలా తెలివిగా సమయస్ పూర్తిగా చేస్తాడు అని చాలామంది అంటూ ఉంటారు .  ఇప్పుడు ఈ విషయంలో చేసింది చూస్తుంటే అదే అనిపిస్తుంది చాలామందికి . మన అందరికి తెలుసు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ 11 నిందితుడిగా అరెస్టు అయ్యాడు.  ఒకరోజు జైలు నిద్ర కూడా చేసి వచ్చి తన కెరీర్ కి మాయని మచ్చగా ఆ రోజుని మిగిల్చుకునేసాడు.  అయితే అల్లు అర్జున్ కి  నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది .


కానీ అల్లు అర్జున్ తరఫున వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో వాదించి మరి అల్లు అర్జున్ కి వెంటనే బెయిల్ తీసుకొచ్చారు . అలా నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది అందో లేదో వెంటనే హైకోర్టు అల్లు అర్జున్ కి బెయిల్ ఇచ్చింది అంటూ వార్తలు వినిపించాయి. అయినా సరే ఒక పక్క ప్లాన్ తోనే జైల్లో ఉంచారు అల్లు అర్జున్  ని అంటూ వార్తలు వినిపిస్తున్న మూమెంట్లో బన్నీ మాత్రం చాలా కూల్ గా రిలీజ్ అవ్వడం ..అసలు ప్రభుత్వాన్ని ఏమాత్రం నెగటివ్గా చూపకుండా చేయడం .. అందరికీ షాకింగ్ గా మారింది .



అంతేకాదు ఆయన రిలీజ్ అయ్యి ఇంటికి రాగానే కోలీవుడ్ స్టార్స్ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరి ఆయనను పరామర్శించి కలిసి వచ్చారు. అయితే ఈరోజు చిరంజీవి ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్ ఆయన భార్య  స్నేహ రెడ్డి . అదేవిధంగా నాగబాబు ఇంటికి కూడా వెళ్లి కలిసి స్పెషల్గా కనిపించివచ్చారు . సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన విజువల్స్ బాగా వైరల్ గా మారాయి . అయితే ఇన్ని రోజులు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి పడలేదు అంటూ ఏవేవో వార్తలు వినిపించాయి.  ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సెట్ అయిపోయాయి . కానీ నువ్వు అదే విధంగా రామ్ చరణ్ కలిస్తే అన్నిటికి ఇక ఫుల్ స్టాప్ పడిపోయినట్టే అంటున్నారు జనాలు . చూద్దాం మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో...?

మరింత సమాచారం తెలుసుకోండి: