మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న చరణ్ ఇప్పటికే తన నెక్స్ట్ మూవీ ని మొదలు పెట్టాడు. చరణ్ తన తదుపరి మూవీ ని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చేస్తున్నాడు.

మూవీ కి మేకర్స్ ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని మేకర్స్ మొదలు పెట్టారు. తాజాగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు ఓ సినిమా ఈవెంట్ కు విచ్చేశాడు. అందులో భాగంగా బుచ్చిబాబు "ఆర్ సి 16" కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను తెలియజేశాడు. తాజా ఈవెంట్లో బుచ్చిబాబు మాట్లాడుతూ ... సినిమా షూటింగ్ నుండే ఈవెంట్ కి వస్తున్నాను. సినిమా షూటింగ్ అద్భుతంగా జరుగుతుంది. చరణ్ అదిరిపోయే రేంజ్ లో యాక్టింగ్ చేస్తున్నాడు అని చెప్పాడు. ఇలా బుచ్చిబాబు ఆర్ సి 16 గురించి సూపర్ సాలిడ్ అప్డేట్ ఇవ్వడంతో రామ్ చరణ్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

సినిమా కచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్లను సాధిస్తుంది అనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఆర్ సి 16 మూవీ లో చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: