అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడు . జైల్లో ఒక రోజు గడిపి వచ్చాడు అని తెలిసి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టింది . పెద్ద - చిన్న స్టార్స్ అని లేకుండా ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ ని ఇంటికి వెళ్లి స్వయాన పలకరించి ఆయన పైన ఎంత ప్రేమ ఉంది ఇండస్ట్రీకి అనేవి విషయాన్ని ప్రూవ్ చేశారు . చాలా మంది సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లడం మనం చూసాం . దానికి సంబంధించిన విజువల్స్ బాగా మీడియా ఛానల్లో వైరల్ అవుతున్నాయి. అయితే అందరూ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన టోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మాత్రం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లలేదు.


పోనీ ఆయన ఏమన్నా పనిలో ఉన్నాడా? ఆ కారణంగానే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లలేదా ..? అంటే అది కూడా కాదు  అనే తెలుస్తుంది. ఆయన హైదరాబాదులోనే ఉన్నాడు . అయితే ఎందుకు అల్లు అర్జున్ ని చూడడానికి అల్లు నివాసానికి వెళ్లలేదు అనేది పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అయితే వాళ్ల మధ్య పెద్దగా గొడవలు ఏమీ లేవు అని.. ఆయన సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు అని.. ఆ కారణంగానే అల్లు అర్జున్ ని ఇంటికి వెళ్లి పరామర్శించలేకపోయాడు అంటున్నారు ఆ హీరో అభిమానులు .



ఆయన రాలేకపోయిన ఫోన్ లో అయినా పరామర్శించొచ్చుగా అనేది బన్నీ అభిమానుల వర్షెన్. ప్రభాస్ దూరంగా ఉండి రాలేదు . అయినా ఫోన్ లో పరామర్శించారుగా . తారక్ కూడా ఇంటికి రాలేదు ..పరామర్శించారుగా ..అలాగే ఫోన్ ద్వారా నాలుగు ముక్కలు మాట్లాడొచ్చుగా అంటూ ఆ హీరోనే దెప్పిపొడుస్తున్నారు . మెగా కుటుంబంతో ఇష్యూ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా మూమెంట్లో ఈ హీరో ఇలా బిహేవ్ చేయడంతో అల్లు అర్జున్ కి ఈ హీరోకి మధ్య ఏమైనా పాత తగాదాలు ఉన్నాయా..? అన్న విధంగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: