2024 సంవత్సరం కూడా అయిపోతుంది. మరో 15 రోజుల్లో కొత్త సంవత్సరం వస్తుంది. అయితే ఒక సంవత్సరం దాటి మరో సంవత్సరంలోకి వెళ్లే ముందు ఆ సంవత్సరంలో ఎన్నో గుడ్ న్యూస్ లు ఎన్నో బాడ్ న్యూస్ లు ఉంటాయి. అలా ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లకు మాత్రం కాస్త బ్యాడ్ న్యూస్ కాస్త గుడ్ న్యూస్ అనేలా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది సెలెబ్రిటీలు వివాదాల్లో ఇరుక్కున్నారు. ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీలు జైలుకు కూడా వెళ్లారు. ఎంతోమంది హీరోల సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సంపాదించాయి.ఇదంతా పక్కన పెడితే ఒక సంవత్సరం కొంతమందికి తీపి అనుభూతులను మిగిల్చితే మరి కొంతమందికి చేదు అనుభూతులను మిగిలిస్తుంది. అయితే ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీకి కొన్ని గుడ్ న్యూస్ లు కొన్ని బ్యాడ్ న్యూస్ లు అందించింది.

ముఖ్యంగా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడం,అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకోవడం అక్కినేని ఫ్యామిలీకి గుడ్ న్యూస్. కానీ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడం,కొండా సురేఖ నాగార్జున,సమంత లపై షాకింగ్ కామెంట్లు చేయడం వారి ఫ్యామిలీకి కాస్త చేదు అనుభవం అని చెప్పుకోవచ్చు.ముఖ్యంగా నాగచైతన్య శోభిత దూళిపాళ్ల పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయం చాలా సంవత్సరాల నుండి వైరల్ అవుతుంది. కానీ ఈ ఏడాది ఆగస్టులో వీరు ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ అవ్వడంతోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి స్కెచ్ పెన్ పట్టుకొని మరీ రెడీ అయిపోయి వారి జాతకం చెప్పాడు..చైతు శోభితల జాతకం ప్రకారం వారు మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా కలిసి ఉండరని,ముఖ్యంగా సమంత చైతన్యలు కలిసి ఉండే పర్సంటేజ్ ఎంత ఉందో అంతకన్నా తక్కువ చైతన్య శోభితలు కలిసి ఉండే అవకాశం ఉంది అని జాతకం చెప్పారు.

అంతేకాదు ఒక లేడీ కారణంగా నాగచైతన్య,శోభితలు విడిపోతారని, 2029 వరకు వీరి జీవితం బాగానే ఉంటుంది.కానీ ఆ తర్వాత వీరి జీవితంలో అనుకోని సంఘటన జరిగి విడాకులు తీసుకుంటారు అంటూ వారి జాతకం చెప్పి సంచలనం సృష్టించారు. అయితే నాగచైతన్య శోభిత లు పెళ్లి చేసుకోకుండానే విడిపోతారు అంటూ వారిపై నెగటివ్ కామెంట్లు చేయడంతో వేణు స్వామి పై తెలుగు ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్ పోలీస్ కేసు పెట్టింది.ఈ కేసు కారణంగా వేణు స్వామి ఇబ్బందుల పాలయ్యారు. అంతేకాదు నేను ఇప్పటినుండి ఏ సెలబ్రిటీ జాతకం కూడా చెప్పను అని మళ్ళీ నాగచైతన్య శోభితల జాతకం చెప్పి చిక్కుల్లో పడ్డారు వేణు స్వామి

మరింత సమాచారం తెలుసుకోండి: