* దెయ్యాల సినిమాలతో టెర్రర్ పుట్టించే రామ్‌ గోపాల్ వర్మకి కొత్త భయం

* అనవసరంగా గెలుక్కొని లీగల్ కేసుల్లో చిక్కుకున్న ఆర్జీవి  

* అతనికి శిక్ష పడుతుందా అనేది సస్పెన్స్  

( ఏపీ - ఇండియా హెరాల్డ్)

ప్రముఖ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2024 లో చాలా ఇబ్బందులను ఫేస్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యుల మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలు చాలా అసభ్యకరమైన రీతిలో ఉండటంతో పోలీసులు కేసు బుక్ చేసి అతడిని కటకటాల వెనక్కి నెట్టాలనుకున్నారు. అంతేకాదు అతనికి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలని భావించారట. ఈ విషయాన్ని స్వయంగా రామ్‌ గోపాల్ వర్మే చెప్పడం గమనార్హం.

ఈ విషయం తెలుసుకుని ఆ తర్వాత ఆయన పోలీసులకు చిక్కకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు. పోలీసుల ముందు హాజరు కావడానికి ఆయన అసలు ఆసక్తి చూపించడం లేదు. తనని అరెస్టు చేసే చట్టం లేదని కూడా రామ్‌ గోపాల్ వర్మ అన్నారు. అంతే కాదు పొలిటిషన్లు పోలీసులను తమ సొంత వ్యాపారం లాగా ఉపయోగిస్తున్నారని సంచలన అలిగేషన్స్ చేశారు. అయితే ఫిజికల్ గా తాను విచారణలో పాల్గొనడానికి ఒప్పుకోనని రామ్‌ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. వర్చువల్ గా తాను ఎలాంటి విచారణలోనైనా పాటిస్పేట్ చేస్తానని స్పష్టం చేశారు. ఎప్పుడూ అందరి పైన ఏది పడితే అది ధైర్యంగా  మాట్లాడే రామ్‌ గోపాల్ వర్మకు ఈసారి ఏపీ పోలీసుల చాలా భయం కలిగించారు.

 హర్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న రాజకీయ నేతలు కాబట్టి ఈసారి అతన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదన్నట్లుగా పోలీసులు అతని వెంట పడుతున్నారు. ఇప్పటికీ అతనిపై ఉన్న కేసు అనేది సాల్వ్ అవ్వలేదు. చివరికి ఏమవుతుందనే ఒక ఆందోళన అయితే ఉంది. ఇది రాంగోపాల్ వర్మ బాగా డిస్టర్బ్ చేస్తుందని అంటున్నారు. ఆయన తన కనెక్షన్లు పెంచుకోవడానికి  చాలామంది గురించి చాలా మంచి ట్వీట్స్ వేస్తున్నారు. ఏదో ఒక మానిప్యులేటివ్ గేమ్ ఆడి అతను దీని నుంచి బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అతనికి శిక్ష పడాలని కొంతమంది బాగా కోరుకుంటున్నారు. మళ్ళీ ఎవరి జోలికి రాకుండా అతనికి తగిన శాస్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: