మంచు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన కుటుంబానికి మంచి గౌరవం ఉంది. అయితే అలాంటి మంచు వారి గౌరవం పూర్తిగా మంచై కరిగిపోయింది. మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ మధ్య గొడవల కారణంగా.. మోహన్ బాబు పరువు మొత్తం పోయింది. గత వారం రోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ప్రైవేట్ వ్యక్తులతో మంచు మనోజ్ ను కొట్టించాడట విష్ణు. ఆస్తి పంపకాల విషయంలో మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే ప్రైవేట్ వ్యక్తులతో దాడి చేయించాడట విష్ణు. గతంలో కూడా వీళ్ళ మధ్య గొడవలు జరిగాయి. అయితే గత వారం రోజుల నుంచి వీరి మధ్య గొడవలు... తార స్థాయికి చేరాయి. విష్ణు వర్సెస్ మంచు మనోజ్ ఇద్దరు బౌన్సర్లను పెట్టుకొని.. నాన రచ్చ చేశారు.
ఇక ఈ గొడవలో చాలా సీరియస్ అయిన మోహన్ బాబు... తన ఇంటికి వచ్చిన మీడియాపై దాడి కూడా చేశాడు. ఈ దాడిలో టీవీ9 జర్నలిస్టు రంజిత్ కు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అటు గొడవలు నేపథ్యంలో మంచి మోహన్ బాబు తో పాటు ఆయన భార్య ఆసుపత్రి పాలు కూడా అయ్యారు. అటు జర్నలిస్టులపై దాడి చేసినందుకు క్షమాపణలు చెప్పే స్థాయికి దిగజారిపోయారు మోహన్ బాబు.
మోహన్ బాబు చర్య వల్ల తెలంగాణ అలాగే ఏపీలో తీవ్ర వ్యతిరేకత చోటుచేసుకుంది. దీంతో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇక ఈ వివాదం చల్లబడిందని అనుకునే లోపే... మంచు మనోజ్ ఇంట్లో కరెంటు తీసేసారని... జనరేటర్లు పంచదార పోసారని సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. కరెంటు షాక్ తో తన ఫ్యామిలీని చంపేందుకు విష్ణు కుట్రలు చేస్తున్నట్లు మంచు మనోజ్ ఆరోపణలు చేశారు. దీనిపై కేసు కూడా పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు మంచు మనోజ్. అయితే పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చినప్పటికీ వీళ్ళ వివాదం మాత్రం తగ్గడం లేదు.