ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ డిసెంబర్ ఐదవ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్స్ ను ఈ మూవీ విడుదలకు ముందు రోజు అనగా డిసెంబర్ 4వ తేదీనే అనేక ప్రాంతాలలో ప్రదర్శించారు. ఈ మూవీకి ప్రీమియర్ షోల ద్వారానే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ విడుదల రోజు నుండి అద్భుతమైన కలక్షన్లను వసూలు చేస్తుంది. ఈ సినిమాకు ఇప్పటివరకు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 591.38 కోట్ల షేర్ ... 1195.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

ఇలా ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన ఈ మూవీ మాత్రం ఇప్పటివరకు బ్రేక్ ఈవేన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోలేదు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ మూవీ 620 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సాఫీస్ బారిలోకి దిగింది. ఇకపోతే ఈ సినిమా 621లో షేర్ కలక్షన్లను వసూలు చేస్తేనే హిట్ స్టేటస్ను అందుకుంటుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1200 కోట్లకు మించి గ్రాస్ కలెక్షన్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ముల ను కంప్లీట్ చేసుకుంటుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేసిన ఫార్ములాను మాత్రం కంప్లీట్ చేసుకోలేదు. ఇక ఈరోజు లేదా రేపు ఈ సినిమా బ్రేక్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎన్ని కలెక్షన్లను వసూలు చేస్తుంది అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేసిన పెద్ద మొత్తంలో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను అందించడంలో విఫలం అవుతుంది అనే అభిప్రాయాలను కొం తమంది వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa