2025 సంవత్సరంలో థియేటర్లలో విడుదలవుతున్న తొలి భారీ బడ్జెట్ సినిమా ఏదనే ప్రశ్నకు గేమ్ ఛేంజర్ సినిమా పేరు జవాబుగా వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ జరుగుతున్నాయా అనే ప్రశ్నకు మాత్రం కాదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ సినిమాపై అంచనాలు పెంచినా మరీ భారీగా అంచనాలు పెరగలేదు.
 
గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ పైనే మెగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ట్రైలర్ క్లిక్ అయితే మాత్రమే గేమ్ ఛేంజర్ మూవీ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దిల్ రాజు నిర్మాతగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ లో వేగం పెంచితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా ఒక భాగంగానే తెరకెక్కుతోందని తెలుస్తోంది.
 
థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని పాటలు బాగానే ఉన్నా మరీ ఆహా ఓహో అనే రేంజ్ లో అయితే లేవు. దేవర, పుష్ప2 పాటలకు వచ్చిన హైప్ గేమ్ ఛేంజర్ సినిమాకు మాత్రం రాలేదనే చెప్పాలి. థమన్ మాత్రం ఈ సినిమా కోసం మరింత కష్టపడుతున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా జనవరి నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
 
గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథ అందించారు. గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ నటించారు. గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ సినిమాలలో చరణ్  గేమ్ ఛేంజర్ ఒకటిగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: